సినీనటుడు మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చిరంజీవి అభిమానులంతా బాబు మోహన్ వ్యాఖ్యల పై విరుచుకుపడుతున్నారు ఇంతకీ బాబు మోహన్ ఏమన్నారో చూద్దాం. తాను బాలకృష్ణ కలిసి భైరవ ద్వీపం అనే సినిమాలో నటించానని బాలకృష్ణల గుర్రపు స్వారీ చేయడం ఎవరి వల్ల కాదు అన్నాడు బాబు మోహన్. అంతటితో ఆగకుండా అ చిరంజీవి గిరంజీవి ఎవరు బాలకృష్ణ లా గుర్రపుస్వారీ చెయ్యలేరు అన్నాడు. బాలకృష్ణ కేవలం ఎటువంటి సపోర్ట్ లేకుండా గుర్రం తో సమానంగా పరిగెడుతూ గుర్రంపై ఎక్కగలరని, ఏ విధమైన సపోర్ట్ లేకుండానే గుర్రంపై దౌడు తీయగలడని చెప్పుకొచ్చాడు. అయితే బాలకృష్ణ పై తనకున్న అభిమానాన్ని చాటు కోవడం తప్పులేదుగాని చిరంజీవిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చిరంజీవి అభిమానులు కోరుతున్నారు. తక్షణమే బాబు మోహన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Babumohan about Balayya —
బాలకృష్ణ గుర్రాలను నడపడంలో మొనగాడు… ఈ చిరంజీవి, గిరంజీవి ఎవడు పనికిరాడు బాలయ్య ముందు ?#JaiBalayya#Jilebi ?? pic.twitter.com/intfw8pmFM
— Balayya BAKTHUDU (@AKHILRAM9769) October 20, 2019