Home / ANDHRAPRADESH / రాజధానిపై ట్వీటేసి నవ్వుల పాలైన నారావారి తనయుడు….!

రాజధానిపై ట్వీటేసి నవ్వుల పాలైన నారావారి తనయుడు….!

ట్విట్టర్ పిట్ట లోకేషం మళ్లీ పప్పులో కాలేశాడు. రాజధానిపై ఏదో గొప్పగా ట్వీటేసాననుకుని మురిసిపోయాడు. అది కాస్తా రివర్స్ అయి నవ్వుల పాలయ్యాడు. తాజాగా ఏపీ రాజధాని అమరావతిపై నారావారి తనయుడు లోకేషం ట్విట్టర్ వేదికగా స్పందించారు. బాబుగారు గత ఐదేళ్లలో ప్రపంచస్థాయి రాజధాని అంటూ గ్రాఫిక్స్‌లో భ్రమరావతిని కట్టించాడే తప్ప..కనీసం ఒక్క శాశ్వత భవనం కట్టలేదు. పైగా కట్టించిన రెండు తాత్కాలిక భవనాలు చిన్నపాటి వర్షానికే కురిసి..బాబుగారి రాజధాని నిర్మాణం అంతా డొల్లే అని నిరూపించాయి. అయితే లోకేష్ మాత్రం తమ హయాంలో ఏదో అద్భుతమైన రాజధాని నిర్మాణం జరిగిపోయినట్లు ఇప్పుడు ఏపీలో జగన్ వచ్చాక అంతా సర్వనాశనం అయినట్లు బిల్డప్ ఇస్తూ ట్వీటేశాడు. .ఏదైనా ఊరిని దుష్టశక్తి ఆవహించినప్పుడు చెట్లు మాడిపోవడం, ప్రజలు ఎక్కడివక్కడ వదిలేసి వెళ్ళిపోవడం కథల్లో వింటుంటాం. అమరావతి విషయంలో అదే జరిగిందేమో. నాలుగేళ్ళ క్రితం ఇదే రోజున రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇప్పుడక్కడ చూస్తే ఎడారిని తలపిస్తోంది. వైయస్ జగన్ గారు మీ పార్టీ డమ్మీలకు కూడా రాజధాని గురించి మీ వైఖరి ఏమిటో తెలీక రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇంతకీ అమరావతి నిర్మాణానికి మీ దగ్గర ప్రణాళికలు ఏవైనా ఉన్నాయా? లేక రాజధానిని ఇంకెక్కడికైనా తరలిస్తున్నారా? మీకోసం రాజధాని ప్రాంతంలో రాజభవనం కట్టుకున్నారు. మరి రాష్ట్రానికి రాజధాని నగరం అక్కర్లేదా? రాజధానిపై మీ వైఖరి ఏంటో మీ నోటితో చెప్పండి…. అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. దీంతో నెట్‌జన్లు పెద్ద ఎత్తు స్పందిస్తున్నారు. ఏం లోకేషమా..మతి కాస్త చెడిందా…ప్రజలు చిత్తుగా ఓడిపోయినా మీ తండ్రి కొడుకులకు బుద్ది రాలేదు…గత ఐదేళ్లు గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మభ్యపెట్టారు. ఇప్పుడు కూడా గ్రాఫిక్స్ చూపిస్తే ఎలా..ప్రజలు పిచ్చోళ్లు కాదు..నువ్వే ఏది చెబితే అది నమ్మడానికి..రాజధాని పేరుతో 30 వేల ఎకరాలు రైతుల దగ్గర లాక్కుని, రెండంటే రెండు అదీ తాత్కాలిక భవనాలు కట్టారు..అవి కూడా చిన్న చినుకు పడితే కురుస్తున్నాయి. నీ పనితనం ఏంటో..మీ బాబు పనితనం ఏంటో ఈ రెండు భవనాలను చూపిస్తే అర్థమవుతుంది. గతంలో తాత్కాలిక సచివాలయంలో చిన్న వర్షానికే నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్ ఛాంబర్‌లోకి నీళ్లు వస్తే…సిగ్గులేకుండా వైసీపీ నేతలే ఏపీ పైపులు కోసారంటూ కారుకూతలు కూసారు..ఇప్పుడు హైకోర్ట్ ఫోటో పెట్టావు..మొన్నీ మధ్య కురిసిన వానకు హైకోర్ట్ గ్రౌండ్ ఫ్లోర్‌ మునిగిపోయింది. ఏదో అద్భుతమైన భవనాలు కట్టి రాజధాని సింగపూర్ స్థాయి రాజధాని కట్టినట్లు వెధవ బిల్డప్పులు ఇవ్వమాక..రాజధాని పేరుతో మీ హయాంలో జరిగిన వేల కోట్ల కుంభకోణం త్వరలోనే బయటపడుతుంది..నువ్వు, మీ నాయన చిప్పకూడు తినే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటూ నెట్‌జన్లు పెద్ద ఎత్తున లోకేష్‌పై విరుచుకుపడ్డారు. మొత్తంగా రాజధానిపై జగన్ సర్కార్‌ను బద్నాం చేద్దామనే అత్యుత్సాహంతో లోకేష్ పప్పులో కాలేసాడు. అందుకే మా చినబాబును పప్పు అనేది..ముందు వెనకా చూసుకోకుండా..ఎలా పడితే అలా ట్వీట్లేసి జనాలతో తిట్టించుకోవడం మా లోకేష్‌కు అలవాటు అయింది..ఎప్పుడు మారుతాడో ఏంటో అంటూ తెలుగు తమ్ముళ్లు తమలో తాము నవ్వుకుంటున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat