ముఖాముఖి కార్యక్రమం ద్వారా టీవీ9 లో పెద్ద ఎత్తున ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్ జర్నలిస్టు జాఫర్ అనంతరం బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు కానీ అక్కడ ఇమడలేకపోయారు మళ్ళీ వచ్చి జాఫర్ ఛానల్ లో జరిగిన అంతర్గత విభేదాల కారణంగా టీవీ9 వీడారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. కొంతకాలం సైలెంట్ గా ఉన్న జాఫర్ తాజాగా టీవీ5 లో చేరారు. ఇక నుంచి టీవీ ఫైవ్ లో తన ప్రస్థానం కొనసాగుతుందని ఎప్పటిమాదిరిగానే సంస్థ పట్ల అంకిత భావంతో పనిచేస్తానని జాఫర్ సన్నిహితుల దగ్గర చెప్పారు.