తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ చేతులెత్తేసినట్లే కన్పిస్తుంది. ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరిగిన ఉప ఎన్నికల బరిలో అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి దిగారు.
ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. మొదటి రౌండ్ నుండి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై తన అధిక్యాన్ని ప్రదర్శిస్తునే ఉన్నాడు.
ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఏడో రౌండ్ ముగిసేసరికి శానంపూడి సైదిరెడ్డి 14,300ఓట్ల అధిక్యంలో దూసుకుపోతున్నాడు.ఇంకా పదిహేను రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంది.