రాయలసీమలోని అనంతపురంలో కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాలు చేసిన జేసీ కుటుంబం మరోసారి పార్టీ మారబోతోంది. కాంగ్రెస్ పార్టీలో లో ఆయన సోదరుడు ఆయన తనయులు ప్రస్తుతం టిడిపిలో కొనసాగుతున్నారు. అయితే 2019లో వైసీపీ సునామీలో దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయ కంచుకోటలు ఏర్పరుచుకున్న జెసి కుటుంబాల పునాదులు కదిలిపోయాయి. ఘోర పరాజయం చెందిన జెసి కుటుంబం ప్రస్తుతం రాజకీయ ఉనికి కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తే తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కోలుకునే పరిస్థితిలో లేదు. పార్టీ సీనియర్ లీడర్లు హేమాహేమీల అంత దారుణంగా ఓడిపోయారు .గ్రామాల్లో టిడిపి కోసం పనిచేసే కార్యకర్తలు కరువయ్యారు . ప్రత్యామ్నాయ పార్టీ జనసేన కూడా ఇప్పుడే పుంజుకునే అవకాశం లేకపోవడంతో వీరంతా ఇప్పుడు జాతీయ పార్టీ అయిన బీజేపీ వైపు చూస్తున్నారు. రాజకీయాల్లో లేకపోతే తమ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని భావించిన జెసి ఆయన సోదరుడు పవన్ ఇద్దరు మరికొద్ది రోజుల్లో బిజెపిలో చేరి పోతున్నారట ఇప్పటికే పార్టీ పెద్దలతో సంప్రదింపులు చేశారట. వచ్చే ఎన్నికల నాటికి కూడా వైసిపికి బీజేపీనే ప్రత్యర్థి పార్టీ అవుతుందని అంచనాలు అందరిలోనూ ఉన్న నేపథ్యంలో ఈ బలమైన రెండు కుటుంబాలు బిజెపిలో చేరి ఆ పార్టీని బలోపేతం చేసి తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.
