ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఎన్నికల ద్వారా పరాజయం పాలయ్యారు. అప్పటినుంచి ఓటమిని జీర్ణించుకోలేని చంద్రబాబు తరచు తన వాటా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు తనను మళ్లీ కోరుకుంటున్నారని తన గుర్తులు కనిపించిన ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం చెరిపేస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి చంద్రబాబుకు చాలెంజ్ చేశారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే కుప్పం నియోజకవర్గంలో మళ్లీ రాజీనామా చేసి గెలవగలరా అని సూటిగా ప్రశ్నించారు. ఆస్తమాటు ఓటమిని జీర్ణించుకోలేకపోవడంతోపాటు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని విజయసాయిరెడ్డి సూచించారు. చంద్రబాబు నిజంగా కావాలనుకుంటే కుప్పంలో ఒకసారి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని అప్పుడు ఎవరు ఏమిటో తేలిపోతుందని విజయసాయిరెడ్డి విమర్శించారు.
