మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా అధిక్యంలో దూసుకుపోతుంది. మొత్తం 288స్థానాలకు మూడు వేలకుపైగా అభ్యర్థులు బరిలో ఉండగా.. అధికార బీజేపీ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్యనే పోరు సాగుతుంది.
ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ 134,కాంగ్రెస్ 86, ఇతరులు 31 స్థానాల్లో అధిక్యాన్ని కనబరుస్తున్నారు. మహారాష్ట్రలో మెజారిటీ ఫిగర్ 145. ప్రస్తుతం 134 స్థానాల్లో అధిక్యంలో ఉన్న బీజేపీ తిరిగి అధికారాన్ని చేపట్టబోతుందని విశ్లేషకులు చెబుతున్నారు.