మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరిగిన సంగతి విదితమే. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు 3,237మంది అభ్యర్థులు బరిలోకి దిగారు.
అయితే ప్రధాన పోటీ కాంగ్రెస్,బీజేపీ పార్టీల మధ్య ఉండనున్నది అని విశ్లేషకులు అంచనా.. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీ ముందంజలో ఉందని తెలుస్తుంది.
మొత్తం 288స్థానాల్లో బీజేపీ 65,కాంగ్రెస్ 24స్థానాల్లో అధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. మొత్తం ఎన్నికల ఫలితాలు సాయంత్రం నాలుగు గంటల్లోపు వెలువడనున్నాయి.