హర్యానా రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా వెలువడుతున్నాయి. మొత్తం రాష్ట్రంలోని తొంబై అసెంబ్లీ స్థానాలకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఎన్నికలు జరిగాయి.
ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ లో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బీజేపీ పార్టీ 38,కాంగ్రెస్ 33,ఇతరులు 29 స్థానాల్లో అధిక్యంలో ఉంది.
దీంతో మరో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన జేజేపీ చీఫ్ దుష్యంత్ ను కాంగ్రెస్,బీజేపీ నేతలు సంప్రదిస్తున్నట్లు సమాచారం. జేజేపీ ఎవరికి మద్దతు ఇస్తే ఆ పార్టీ అధికారాన్ని చేపడుతుంది.