ప్రముఖ సినీ నిర్మాత మాజీ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ను గురువారం బంజారాహిల్స్ ఏసీపీ ఆఫీస్ నుంచి కడపకు తీసుకెళ్లారు. 2014లోనే కడపకు చెందిన మహేష్ అనే ఓ వ్యాపారి దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్న బండ్ల గణేష్ ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా ఆయన అనేక ఇబ్బందులకు గురిచేశారు. ఈ క్రమంలో చెక్ బౌన్స్ అవడంతో బండ్ల పై కేసు నమోదైంది. అయితే ఈ కేసు విచారణ సమయంలో బండ్ల గణేష్ నిర్లక్ష్యం వ్యవహరించారు. కోర్టు విచారణకు హాజరు కాకుండా తిరుగుతున్నారు. మరోవైపు బండ్ల గణేష్ పై కడప ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్‌క్లాస్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అఫెన్సెస్ న్యాయమూర్తి సెప్టెంబర్ 18న అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. ఈ క్రమంలో బండ్ల రాజకీయ అరంగేట్రం చేయటం, అక్కడినుండి బయటకు వచేయటం కూడా జరిగిపోయాయి. అయితే అక్టోబర్ 5వ తేదీన ప్రముఖ వ్యాపార వేత్త వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ ఇంటిపై బండ్ల అనుచరులు దౌర్జన్యం చేయడంతో పివిపి పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బండ్లకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పాత కేసులు మరియు చెక్ బౌన్స్ చేసిన కేసు విషయంలో బండ్లకు భారీగా శిక్ష పడుతుందని స్పష్టమవుతోంది.
