వైవి సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా బాధ‌్యతలు స్వీకరించిన తర్వాత తిరుమల తిరుపతిలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారు. ముందుగా ఎల్1, ఎల్2, ఎల్3 బ్రేక్ దర్శనాలు రద్దు చేసి, భగవంతుడి ముందు ప్రతి ఒక్కరూ సమానమే అన్నారు. అలాగే 60 ఏళ్లు దాటిన వృద్ధులకు కేవలం 30 నిమిషాల్లో శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. తాజాగా శ్రీ వాణి ట్రస్ట్ ప్రారంభించి, రూ. 10 వేలు విరాళం ఇచ్చిన ప్రతి భక్తుడికి విఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. ఇవాళ్టి నుంచి తిరుమల తిరుపతిలో శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభమైంది. టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి ఇవాళ శ్రీ వాణి ట్రస్ట్ విరాళాలు, విధివిధానాల గురించి ప్రకటించారు. గోకుళం జేఈవో ఆఫీస్‌లో ఈ శ్రీవాణి ట్రస్ట్ అందుబాటులో ఉంటుంది.. దాదాపు నెల రోజులు శ్రీవాణి ట్రస్ట్‌పై అధ్యయనం చేశారు. ఈ శ్రీవాణి ట్రస్ట్‌కు రూ. 10 వేలు విరాళం అందించే ప్రతి భక్తుడికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. ప్రోటో కాల్ విఐపీలతో పాటు సమానంగా శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళం అందించిన భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. శ్రీవాణి ట్రస్ట్‌కు వచ్చిన విరాళాలను ఆలయాల నిర్మాణానికి, ధూపదీప నైవేద్యాలకు ఖర్చు చేస్తారు.శ్రీవాణి ట్రస్ట్‌కు లక్ష విరాళ దాటితే వారికి ఇతర పథకాలపై ఉన్న ప్రివిలేజ్‌ను వర్తింపజేస్తారు. తిరుమలలో భక్తుల స్పందన మేరకు శ్రీవాణి ట్రస్ట్ ను మరింత విస్తృతం చేస్తారు. మరో 15 రోజులలో శ్రీవాణి బుకింగ్ టీటీడీ యాప్ లోను, వెబ్ సైట్ లోను పొందు పరుస్తాం. ప్రారంభమైన రోజే శ్రీవాణి ట్రస్ట్‌కు భక్తుల ద్వారా కోటి 10 లక్షలు విరాళాలు వచ్చాయి. భక్తులు విరాళం అందించిన సమయం నుంచి…6 నెలల వరకు కాల పరిమితి ఉంటుంది. ఈ 6 నెలల్లో విరాళం అందించిన భక్తులు ఎప్పుడు వచ్చినా విఐపీ బ్రేక్ దర్శనం ఇప్పిస్తారు.