గతంలో జగన్ మూడు నెలల పాలనకు వందకు వంద మార్కులు ఇవ్వాలంటూ మాజీ ఎంపీ జెసి దివాకరరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ఐతే ఇప్పుడేమో వందకు నూట యాబై మార్కులు ఇవ్వాలంటూ కామెంట్లు చేసాడు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పాలన జనరంజకంగా సాగుతోంది 100కు 150 మార్కులు వేస్తా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ట్రావెల్స్ బస్సులు ఉన్నా.. సీఎం జగన్‌కు నా బస్సులే కనిపిస్తున్నాయి ఇప్పటివరకు నా ట్రావెల్స్‌కు చెందిన 31బస్సులను సీజ్ చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానంటున్నాడు. తన బస్సులనే భూతద్దంలో చూసి సీజ్ చేశారని, జరిమానాలతో పోయే తప్పిదాలకు సీజ్ చేయడం ఎంతవరకు సబబు అని అన్నారు. అంతేకాదు జగన్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ మ అబ్బాయే అన్నారు జెసి దివాకరరెడ్డి .
