ప్రభాస్ అలియాస్ ఉప్పలపాటి ప్రభాస్ వర్మ.. వెటరన్ నటుడు ప్రముఖ బిజెపి నాయకుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు నట వారసుడిగా సినీ అరంగేట్రం చేసిన ప్రభాస్ తన ఓన్ బాడీ లాంగ్వేజ్‌తో అగ్ర నటుడిగా ఎదిగారు. పెదనాన్న సపోర్ట్‌తో సినిమాల్లోకి వచ్చిన ఎక్కడ ఆ పేరును వాడుకోలేదు. కెరీర్ ప్రారంభంలో ప్రభాస్ అటు ఇటుగా యావరేజ్ సినిమాలు మాత్రమే చేసేవాడు. అనంతరం అగ్ర హీరోల జాబితాలో చేరిపోయాడు. అనంతరం వచ్చిన సినిమాల్లో ప్రభాస్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నారు. డార్లింగ్ డార్లింగ్ అంటూ అభిమానులు కూడా ప్రేమగా ఆప్యాయంగా పిలుచుకునే తనకంటూ భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అలాగే ప్రభాస్ సినీ చరిత్రలో బాహుబలి బిగినింగ్ బాహుబలి కంక్లూజన్ సినిమాలు మైలురాయిగా నిలిచిపోయాయనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. భారతదేశ సినీ రికార్డులన్నింటినీ బాహుబలి సినిమా బద్దలు కొట్టింది. బాహుబలి తోనే ఆగకుండా సాహో సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల సినిమా పరిశ్రమకు తెలుగు సినిమా సత్తా చాటి చెప్పాడు ప్రభాస్. సినిమా ఎలా ఉన్నా కూడా ప్రభాస్ వ్యక్తిగత జీవితం కూడా ఎన్నో విమర్శలకు దారితీసింది. ప్రభాస్ పై కూడా సోషల్ మీడియాలో ఇతర హీరోల అభిమానులు కూడా ఎన్నోసార్లు ఇన్స్పెక్టర్ ఆయన ఎప్పుడో వాటిపై పెద్దగా ప్రభాస్ సీరియస్ గా పట్టించుకోలేదు. వ్యక్తిగత జీవితంలో ఎక్కువ మంది స్నేహితులు ఉన్నది ఇండస్ట్రీ మొత్తంలో ఒక్క ప్రభాసే అని ఆశ్చర్యం లేదు అంతగా ఫ్యాన్స్‌ను స్నేహితులను సంపాదించుకున్నారు ప్రభాస్. ఇప్పటికైనా నాలుగు పదులకు దగ్గరగా ముందే ప్రభాస్ ఓ ఇంటివాడు అవ్వాలని ఆయన అభిమానులు కుటుంబ సభ్యులు ఆకాంక్షిస్తున్నారు. భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ తెలుగు సినిమా స్థాయిని చాటిచెప్పిన ప్రభాస్ కు దరువు తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
