ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది ఖచ్చితంగా శుభవార్తనే. స్టాప్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్ సీ) కంబైన్డ్ గ్రాడ్యూయేట్ లెవల్(సీజీఎల్) ఎగ్జామిషన్ 2019-20నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలయింది. కేంద్రంలోని పలు మంత్రిత్వ శాఖలు,విభాగాలు సంస్థల్లో ఉన్న వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇందులో చాలా పోస్టులకు డిగ్రీ అర్హతగా ఉంది.
డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు అఖరి తేది నవంబర్ నెల ఇరవై ఐదో తారీఖు.