చాణక్య ఫౌండేషన్ సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో జాతీయ స్థాయిలో ఉత్తమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ రూరల్ జిల్లాకి చెందిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గత నెల 26 వ తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి, పద్మభూషణ్ మురళి మనోహర్ జోషి గారి చేతుల మీదగా అవార్డు అందుకున్నారు.
సందర్భంగా మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారిని అభినందనలు తెలిపారు..