ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని మంత్రి వర్గం ఈ నెల ముప్పై తారీఖున సమావేశం కానున్నది. అంతేకాకుండా ఇక నుండి ప్రతినెల పది హేను రోజులకు ఒకసారి క్యాబినేట్ భేటీ కావాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు.
ఇందులో భాగంగా ప్రతి నెల రెండు,నాలుగు బుధవారాల్లో మంత్రి వర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల ముప్పై తారీఖున కానున్న భేటీలో ప్రస్తుతం ఢిల్లీ పర్యటన ముగించుకోనున్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఢిల్లీ పర్యటన విషయాల గురించి మెయిన్ ఎజెండాగా చర్చించి. భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నదని సమాచారం.