ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీసుకుంటున్న యూటర్నూలకు అంతూ పొంతూ లేకుండా పోతుంది. గతంలో బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో తనకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందో అనే భయంతో యూటర్న్ తీసుకుని బిజెపి ని దారుణంగా విమర్శించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో బిజెపి పట్ల వైసిపి పట్ల సానుకూలత వ్యక్తమైంది. బిజెపి దేశంలో తిరుగులేని శక్తిగా, వైసిపి అత్యంత బలమైన రాజకీయ పార్టీగా ఏపీలో నిలబడింది. అయితే తాను ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల నాటికి కనీసం ఎవరూ తనను పట్టించుకోరనే భావన్లో చంద్రబాబు ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అమిత్ షా ను జగన్ ను కలిసినా విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా బిజెపి తో మళ్లీ కలిసే ప్రయాణం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎందుకు తాజాగా ఆయన ఆయన చేసిన వ్యాఖ్యలే ఉదాహరణ. మోడీని వ్యక్తిగతంగా గాని బీజేపీని పార్టీపరంగా గాని తాను పెట్టలేదని, కేవలం రాష్ట్రానికి కావలసిన నిధుల కోసం మాత్రమే ప్రయత్నిస్తూ విమర్శించారని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల ద్వారా చంద్రబాబు మోడీకి దగ్గర ఎందుకు ప్రయత్నిస్తుండగా మరోవైపు బిజెపి మాత్రం ఇలాంటి నాయకుడు తమకు వద్దు అంటూ టీడీపీకి దూరం జరుగుతుంది.
