బీజేపీ ఎమ్మెల్యేలు వరుసగా అత్యాచారం కేసులు, మహిళలపై లైంగిక వేధింపులు కేసుల్లో అడ్డంగా ఇరుక్కుంటున్నారు. ఉన్నావో అత్యాచార ఘటన మరువకముందే మరో బీజేపీ ఎమ్మెల్యే ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరక వాంఛ తీర్చుకుని, మోసం చేసిన ఘటన ఇప్పుడు కర్నాటక రాష్ట్రంలో సంచలనంగా మారింది. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా లొంగదీసుకుని, మోసం చేశారంటూ ప్రేమకుమారి అనే మహిళ కృష్ణరాజ నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఎ. రామదాస్ మీద ప్రత్యేక న్యాయస్థానంకు ఫిర్యాదు చేసింది. ప్రేమ కుమారి ఫిర్యాదు మేరకు ఈ కేసు విచారణకు నవంబర్ 11 వ తేదీన కోర్ట్ ముందు హాజరు కావాలని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి రామచంద్ర డి. హుద్దార బీజేపీ ఎమ్మెల్యే ఎస్.ఏ. రామదాస్‌కు సమన్లు జారీ చేశారు. అయితే ఈ కేసు ఐదేళ్లగా కొనసాగుతుండడం గమనార్హం. 2014 ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమకుమారి అనే మహిళ తనను బీజేపీ ఎమ్మెల్యే ఎస్.ఏ. రామదాస్ ప్రేమ పేరుతో లైంగికంగా లొంగదీసుకుని, పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడంటూ , మైసూరులోని సరస్వతిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో ప్రేమకుమారికి అనేక మహిళాసంఘాలు మద్దతు ఇచ్చాయి. కాగా ప్రేమకుమారి తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తుందని, డబ్బుల కోసమే బ్లాక్ మెయిల్ చేస్తోందని, ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని అప్పట్లో బీజేపీ మంత్రిగా ఉన్న ఎస్ఎ. రామదాస్ ఆరోపించారు. మంత్రిగా ఉన్న ఎస్ఎ. రామదాస్‌పై ఆరోపణలు రావడంతో నాటి బీజేపీ ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. ఈ కేసు విచారణ చేసిన సీఐడీ అధికారులు ఎస్ఎ. రామదాస్ కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు లేవని రిపోర్ట్ ఇచ్చారు. కాగా ఇటీవల సీఐడీ అధికారులు సమర్పించిన బి రిపోర్టు రద్దు చేయాలని, తనకు న్యాయం చేయాలంటూ ప్రేమకుమారి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయస్థానం నవంబర్ 11న కోర్ట్ ముందుకు హాజరు కావాలని బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఎ. రామదాసుకు సమన్లు జారీ చేశారు. మొత్తంగా ప్రేమ ప్రేరుతో దగ్గరై, శారీరక వాంఛ తీర్చుకుని పెళ్లి చేసుకోకుండా మోసం చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఎస్.ఏ. రామదాస్ చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం ఈ బీజేపీ ఎమ్మెల్యే ప్రేమకథా చిత్రమ్..ఇప్పుడు కర్నాటకలో హాట్‌టాపిక్‌గా మారింది.
