తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మల్కాజ్ గిరి ఎంపె అనుముల రేవంత్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సీనియర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. అందులో భాగంగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే బేగంపేటలోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ ను ముట్టడించాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు.
దీంతో రేవంత్ పై ఆపార్టీకి చెందిన సీనియర్లంతా గుర్రుగా ఉన్నారు. ఎవరికి చెప్పి రేవంత్ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు అని సీఎల్పీ సమావేశంలో తమ అగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా రేవంత్ పై అధిష్టానానికి పిర్యాదు చేయనున్నట్లు ఈ సమావేశంలోనే వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.