ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి డిల్లీ వెళ్లారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రానికి రావాల్సిన నిధులకోసం అమిత్ షాతో చర్చించారు. అయితే అమిత్ షా పుట్టినరోజు కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆయన సన్నిహితులు కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు బిజెపి పార్టీకి చెందిన అగ్ర నేతలు అమిత్ షా ను కలిసేందుకు వచ్చారు. అయితే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో జగన్ కు అపాయింట్మెంట్ దొరుకుతుందా లేదా అని చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. కొంతమంది అయితే ఏదో ఒక ఐదు పది నిమిషాలు అమిత్ షా జగన్ భేటీ అవుతారని భావించారు. కానీ జగన్ తో అమిత్ షా 45 నిమిషాలు ఏకాంతంగా చర్చించారు. రాష్ట్రానికి కావలసిన నిధులు రాష్ట్ర అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు ముఖ్యంగా నీటి జలాల తరలింపు కోసం నిర్మించబోయే ప్రాజెక్టుల విషయంలో లో జగన్ అమిత్ షా ను నిధులు కేటాయించాలని కోరారు. జగన్ అడిగిన అన్నిటికీ అమిత్ షా ఓకే చెప్పారు. అయితే ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని జగన్ విన్నవించారు. అన్ని శాఖల కార్యదర్శిల తో మాట్లాడి ఏపీ కి కావాల్సిన నిధులు ఇస్తామని ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలిస్తామని అమిత్షా వెల్లడించారు అయితే అంతటి బిజీ షెడ్యూల్ లో కూడా జగన్ కు 45 నిమిషాలు కేటాయించటం పట్ల ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
