తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని చూసిన వారికి ఊహించని షాక్ తగిలింది. మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ తెలిపింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని దాఖలైన అన్ని వ్యాజ్యాలను హైకోర్టు కోట్టేసింది. దీంతో త్వరలో రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు తదితర అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా ప్రక్రియ చేపట్టడం లేదని పేర్కొంటూ పలువురు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గత కొన్ని నెలలుగా పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. తాజాగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నేడు తీర్పును వెలువరిస్తూ పిటిషనర్ల అభ్యంతరాలను కొట్టివేస్తూ మున్సిపల్ ఎన్నికలకు పచ్చాజెండా ఊపింది. రిజర్వేషన్లు, వార్డుల విభజనపై దాఖలైన అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది.