ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ,మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరీ వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ” వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఏపీలో ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి. వాళ్లు పిచ్చి పిచ్చి వేశాలు వేస్తే కేంద్ర ప్రభుత్వం ,బీజేపీ చూస్తూ ఊరుకోదు”అని అనంతపురంలో జరిగిన గాంధీ సంకల్ప యాత్రలో హెచ్చరించారు.
పీపీఏలను రద్దు చేయవద్దు అని కేంద్ర ప్రభుత్వం ఒకవైపు చెబుతున్న కానీ జగన్ నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.