తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ఆర్టీసీ సిబ్బంది గత పద్దెనిమిది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విధితమే. ఈ క్రమంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆర్టీసీ సిబ్బందితో చర్చలు జరపాలని సూచించింది.
అయితే తాజాగా ఆర్టీసీలో బస్సుల టెండర్లను సవాల్ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘం హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేసింది. ఆర్టీసీకి బోర్డుకు లేకుండా ఎండీ టెండర్లు పిలవడం చట్ట విరుద్ధం అని ఫిటిషన్ పేర్కొన్నారు.
సమ్మెపై ఏ విషయం తేల్చకుండా శాశ్వత ప్రాతిపదికన అద్దె బస్సులు తీసుకుంటున్నారన్నారు. ఆర్టీసీ సొంత బస్సులు నడిపే పరిస్థితుల్లో లేదని.. ప్రభుత్వం కోర్టుకు తెలపడంతో అన్ని ఫిటిషన్లు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున విచారిస్తామని హైకోర్టు తెలిపింది.