సోషల్‌మీడియాను సామాజిక మేల్కొలుపు కోసం వినియోగిస్తున్నారు ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనే కాదు, ప్రజాచైతన్య కార్యక్రమాలకు పిలుపునివ్వడంలోనూ ముందువరుసలో ఉంటున్నారు. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు. అభాగ్యులకు అండగా నిలుస్తూ.. యువతకు రోల్‌మోడల్‌గా నిలుస్తున్నారు. మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ స్టార్‌గా వెలుగొందుతున్నారు.
ట్విట్టర్‌లో క్రియాశీలకంగా ఉండే మంత్రి కేటీఆర్ సమాజంలో పొంచిఉన్న ప్రమాదాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువ ఉండటంతో పరిశుభ్రతే నివారణ అని సూచిస్తూ ‘సొంతింటి పారిశుద్ధ్యం’ పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 10న ప్రగతిభవన్ ఆవరణలో దోమల వృద్ధికి అవకాశం ఉన్న నీటితొట్లను తొలగించి సొంతింటి పారిశుద్ధ్యాన్ని స్వయంగా ప్రారంభించారు.
ప్రతిఒక్కరూ తమ ఇండ్లలో పరిశుభ్రతపై దృష్టిసారించి ప్రభుత్వ ప్రయత్నాల్లో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ, సినీరంగ ప్రముఖులతోపాటు టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ పిలుపుతో స్ఫూర్తిపొందారు. సినీ నటులు మహేశ్‌బాబు, ప్రభాస్, సమంత, రాష్ట్రంలోని పలు జిల్లాల కలెక్టర్లు స్వచ్ఛందంగా సొంతింటి పారిశుద్ధ్యాన్ని పాటించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్‌సిసోడియావంటివారు సొంతింటి పారిశుద్ధ్యంతో వ్యాధుల నిర్మూలన అనేది గొప్ప నిర్ణయమని మంత్రి కేటీఆర్‌ను మెచ్చుకున్నారు. కేటీఆర్.. ట్విట్టర్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఆపదలో ఉన్నామని ట్వీట్‌చేస్తే చాలు.. ఆదుకుంటామని భరోసా కల్పిస్తున్నారు. ఆర్థికస్థోమత లేనివారి చదువుల కోసం వ్యక్తిగతంగా సాయంచేస్తున్నారు. ‘ఆస్క్ కేటీఆర్’ పేరుతో ట్విట్టర్‌లో ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు. By Namasthe Telangana
Post Views: 254