తెలంగాణ ఆర్టీసీకి చెందిన సిబ్బంది సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మెట్రోతో ఆ ఇబ్బంది ఎదురుకాకుండా ఉండటంలో దోహదపడుతుంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డును సృష్టించింది. వరుసగా పండుగ సెలవులు ముగియడంతో సోమవారం అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలు తెరుచుకోవడంతో ఒక్కరోజే నాలుగున్నర లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణం చేశారు.
ప్రస్తుతం రద్ధీగా ఉండటంతో సగటున ప్రతి మూడున్నర నిమిషాల నుండి నాలుగున్నర నిమిషాలకు చొప్పున మెట్రో రైలు నడుస్తుంది. సాధారణ సమయంలో ఆరు నుంచి ఏడు నిమిషాలకు ఒక రైలు నడుపుతున్నారు. అదనంగా నాలుగు రైళ్లతో 120 టిప్పులతో మొత్తం 830టిప్పులు నడిపారు.