ఏపీలో జగన్ సర్కార్ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఒకేసారి లక్షా 30 వేలకు పైగా గ్రామవాలంటీర్లు, గ్రామసచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో నెల రోజుల వ్యవధిలోనే నోటిఫికేషన్ విడుదల చేసి, ఉద్యోగ నియామక ప్రతాలు అందజేసింది. అయితే మొదటి నుంచి గ్రామవాలంటీర్లు, గ్రామసచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు విషం గక్కుతూనే ఉన్నాడు. గ్రామవాలంటీర్లను సామాన్లు బండిమీద పెట్టుకుని ఇంటింటికి తిరిగే కూలీగా పోల్చుతూ టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేయించాడు. తర్వాత పరీక్షల సమయంలో చప్పుడు చేయని చంద్రబాబు..తీరా రిజల్ట్స్ వచ్చాకా..పేపర్ లీక్ అయిందంటూ ఎల్లోమీడియాలో దుష్ప్రచారం చేయించాడు. గ్రామవాలంటీర్ల ఉద్యోగాలను వైసీపీ నేతలు రూ. 5 లక్షలకు అమ్ముకున్నారంటూ కువిమర్శలు చేశాడు. అలాగే మగవాళ్లు లేనప్పుడు వచ్చి ఇంటి తలుపులు కొడితే..ఆడవాళ్ల పరిస్థితేంటి అంటూ….గ్రామవాలంటీర్లు, గ్రామసచివాలయ ఉద్యోగులంతా రేపిస్ట్‌లు అనే అర్థం వచ్చేలా దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. తాజాగా శ్రీకాకుళంలో జరిగిన పార్టీ సమావేశంలో గ్రామసచివాలయ ఉద్యోగాలన్నీ వైసీపీ కార్యకర్తలకే వచ్చాయంటూ చంద్రబాబు మరోసారి అక్కసు వెళ్లగక్కాడు. సివిల్స్ పాస్ అయిన వ్యక్తి సచివాలయ ఉద్యోగానికి సెలెక్ట్ కాలేదని..వైసీపీ కార్యకర్తలకు మాత్రం ర్యాంకులు వచ్చాయని బాబు ఆరోపించాడు. లక్షల మంది వైసీపీ కార్యకర్తలను గ్రామవాలంటీర్లుగా నియమించుకుని నెలనెలా రూ. 8 వేలు జీతం ఎవడబ్బ సొమ్మని ఇస్తారు అంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. శ్రీకాకుళంలో చంద్రబాబు చేసిన విమర్శలపై గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలు మండిపడుతున్నారు. తాము కష్టపడి చదివి, ఉద్యోగం సంపాదించుని ఆత్మగౌరవంతో బతుకుతుంటే..తమను వైసీపీ కార్యకర్తలు అంటూ విమర్శించడం చంద్రబాబుకు తగదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలకు ఎక్కువగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్లే ఎంపికయ్యారు. వీరంతా అన్ని పార్టీలకు చెందిన వాళ్లు ఉన్నారు. అంతెందుకు టీడీపీ పార్టీకి చెందిన కుటుంబాలకు చెందిన వారు కూడా గ్రామవాలంటీర్లు, గ్రామసచివాలయ ఉద్యోగాలు సాధించారు అంటూ సాక్ష్యాలు చూపిస్తున్నారు. గుంటూరు జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడైన వేమూరు గ్రామానికి చెందిన యన్నం నాగరాజు పరీక్ష రాసి గ్రామ సచివాలయంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం నుదురుపాడుకు చెందిన ఉప్పు మణికంఠ సర్వేయర్ అసిస్టెంట్ గ్రేడ్–2 ఉద్యోగం సాధించాడు. టీడీపీ ఆవిర్భావం నుంచి మణికంఠ కుటుంబం టీడీపీలోనే ఉంది. ఒక్క గుంటూరు జిల్లాలోనే వందలమంది టీడీపీ సానుభూతిపరుల కుటుంబాలకు చెందిన వాళ్లు గ్రామసచివాలయ ఉద్యోగాలు సాధించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎన్నికయ్యారు. ఒక్కసారి ఎంపిక అయిన ఉద్యోగుల కుటుంబనేపథ్యాన్ని పరిశీలిస్తే ఈజీగా అర్థమవుతుంది. మరి చంద్రబాబు మాత్రం తమ పార్టీ కార్యకర్తలకు వచ్చిన ఉద్యోగాలను మరిచి.. గ్రామవాలంటీర్లు, గ్రామసచివాలయ ఉద్యోగాలన్నీ వైసీసీ కార్యకర్తలకే వచ్చాయంటూ ఆరోపణలు చేయడం దారుణాతి దారుణం..కష్టపడి చదవి ఉద్యోగం సాధించిన యువతను అవమానించేలా మాట్లాడడం ఏం బాగాలేదని టీడీపీ కార్యకర్తలే అంటున్నారు. మొత్తంగా అయ్యా బాబుగారు..మీ టీడీపీ కార్యకర్తలకు కూడా గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలు వచ్చాయి..కాస్త కళ్లు తెరచి చూడండంటూ..ఏపీ యువత చురకలు వేస్తోంది.
