వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో ఖలీల్ అనే వ్యక్తి ఒక బేకరీలో పని చేస్తున్నాడు. ఈ నెల పదిహేనో తారీఖున బేకరీలో కొనడానికి వచ్చిన ఒక యువకుడు తీసుకెళ్లడానికి ఫ్లాస్టిక్ కవరు ఇవ్వాలని ఖలీల్ ను అడిగాడు. కానీ ఫ్లాస్టిక్ కవరు ఇవ్వలేము.. ఫ్లాస్టిక్ కవర్స్ నిషేదం అని తెలిపాడు. దీంతో కోపోద్రిక్తుడైన సదరు యువకుడు ఖలీల్ తలపై ఇటుకతో దాడికి దిగాడు. ఇటుకతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో పోలీసులు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
