హుజూర్‌నగర్ శాసనసభ స్థానానికి ఇవాళ పోలింగ్ జరుగుతోంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల జరుగుతోంది. ఇవాళ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మఠంపల్లి మండలంలోని తన స్వగ్రామం గుండ్లపల్లిలో ఓటు వేశారు. హుజూర్ నగర్ బరిలో మొత్తం 28మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని 302 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు నియోజకవర్గ ప్రజలు (2,36,842 మంది ) తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలను అక్టోబరు 24న ప్రకటిస్తారు. కాగా రాష్ట్రంలో జరుగుతున్న ఏకైక ఉపఎన్నిక కావడంతో అందరి దృష్టి హుజూర్‌నగర్‌పై నెలకొంది.
Tags by election gundlapalli Huzurnagar constituency poling politics saidireedy Telanagana trs candidate vote
Related Articles
చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన శుభాకాంక్షలు
November 22, 2022
సీఎం కేసీఆర్ పై అభ్యంతకర పోస్టులు.. సీసీఎస్ లో సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి పిర్యాదు
March 24, 2022
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభకాంక్షలు
March 7, 2022
తెలంగాణలో కొత్తగా 41,042 కరోనా కేసులు
February 19, 2022