హుజుర్నగర్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 85 శాతం పోలింగ్ నమోదైంది. ఈ క్రమంలోనే హుజూర్ నగర్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమన్నారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే ఆయన ట్వీట్ చేశారు. ఉపఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఎంతగానో కష్టపడ్డాయని.. కార్యకర్తలు, నేతల నుంచి వస్తున్న సమాచారం మేరకు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సైదిరెడ్డి మంచి మెజార్టీతో గెలవబోతున్నట్లు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఓటింగ్ లో పాల్గొన్న హుజూర్ నగర్ ఓటర్లకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
I would like to thank each and every TRS leader & grassroots worker that had worked hard in the Huzurnagar By election for over the last one month ?
Based on the feedback from our leaders, I am very confident that TRS candidate Saidi Reddy is winning with a respectable majority
— KTR (@KTRTRS) October 21, 2019