మంచి ఫామ్లో ఉన్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై నాలుగు నుంచి జరగనున్న బంగ్లాదేశ్ తో ట్వంటీ ట్వంటీ సిరీస్ కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ప్రస్తుతం విరాట్ కు ఉన్న పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని అతడ్ని సంప్రదించిన తర్వాతే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకుంటారు. సారథి విరాట్ ఎలా స్పందిస్తాడు అనే పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే గత ఏడాది ఓసీటీ నుంచి టీమిండియా 56 ట్వంటీ ట్వంటీల్లో తలపడితే విరాట్ కోహ్లీ నలబై ఎనిమిది మ్యాచులు ఆడాడు.