తొలిసారిగా టెస్టుల్లో ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన తడాఖా చూపిస్తున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు శతకాలు బాదిన రోహిత్ మూడో టెస్ట్‌లో మరో సెంచరీ చేశాడు. అయితే వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలతో మోత మోగించిన రోహిత్ టెస్టుల్లోను తొలి ద్విశతకం నమోదు చేసాడు.
ఇదే ఆయనకి టెస్టుల్లో అత్యుత్తమ స్కోరు. ఒకవైపు వికెట్స్ పడుతున్నప్పటికి ఎంతో ఓపికగా ఆడుతూ వచ్చిన రోహిత్ శర్మ 248 బంతుల్లో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఇందులో 28 ఫోర్స్, 5 సిక్స్‌లు ఉన్నాయి.
రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్ నాలుగు వికెట్స్ కోల్పోయి 363 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్, జడేజా ఉన్నారు. అంతకముందు రహానే 2016 తర్వాత హోమ్ గ్రౌండ్‌లో తొలి సెంచరీ చేశాడు. రోహిత్‌తో కలిసి 267 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.