టీమిండియా ఆటగాళ్లు రహానె,రోహిత్ ల జోడి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచులో నాలుగో వికెట్ కు అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో సఫారీలపై అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన టీమిండియా జోడిగా రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే గతంలో ఈ రికార్డు కోహ్లీ రహెనే పేరిట ఉంది. మూడో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో రోహిత్ రహానెల జోడి 185పరుగులు చేశారు. గతంలో కోహ్లీ రహానెల జోడి 178 పరుగులు చేశారు.
