తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ మహానగరంలో దారుణ హత్య జరిగింది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట లో వల్లభ్ నగర్ లో ఆర్మీ జవాన్ దారుణ హత్యకు గురయ్యాడు. తన దోస్తు పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని శనివారం రాత్రి ఇద్దరి స్నేహితుల మధ్య నేలకొన్న ఘర్షనను రాజీ చేసేందుకు ఆర్మీ జవాన్ అయిన ప్రేమ్ కుమార్ యత్నించాడు. ఆ సమయంలో కొంతమంది యువకులు అతనిపై దాడి చేసి కత్తితో పోడిచారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ప్రేమ్ కుమార్ ను స్థానికులు హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు.
