తెలంగాణలో నల్లగొండ జిల్లాలోని రేపు జరగనున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం అయింది…ఎన్నికల కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.. కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక అబ్జార్వర్లలు,జిల్లా ఎన్నికల అధికారి ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు… నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేల ఏర్పాట్లు చేశారు.. నియోజకవర్గంలో మొత్తం 7 మండలాల పరిధిలో 302 పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేశారు.. ఇందులో 79 పోలింగ్ కేంద్రలను సమసస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి అక్కడ ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా sp భాస్కరన్ పర్యవేక్షణలో ప్రతి పోలింగ్ కేంద్రంలో a.si తో కూడిన బృందం విధులు నిర్వర్తిస్తున్నారు… మొత్తం 1500 మంది పోలీసులు విధుల్లో వున్నారు…
ఇక మరో 1500 మంది సిబ్బందిని పోలింగ్ కోసం ఉపయోగిస్తున్నారు..ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు… ప్రతి ఓటర్కు ఇప్పటికే ఓటరు స్లిప్ లను పంపిణీ చేయగా, గుర్తింపు కార్డ్ చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా అధికారులు ఓటర్లను కోరారు…ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నారు..ఎన్నికల కోడ్ ను పకడ్బందీగా అమలు చేస్తున్న అధికారులు నియోజకవర్గ వ్యాప్తంగా 14 చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు.. వీటితో పాటు సర్వేలైన్ టీం లు, flaying స్క్వాడ్ లు, వీడియో సర్వేలైన్ టీం లు విధులు నిర్వహిస్తున్నారు….ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు..ఇందు కోసం ఇంజినీరింగ్ విద్యార్థులు ను ఉపయోగిస్తున్నారు….ప్రతి ఎన్నికల్లో లాగానే ఈ ఎన్నికల్లో కూడా నోటా తో పాటు vvpat (ఓటర్ వేరిఫెయిబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ ) మిషన్ ను ప్రతి పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేశారు.. ఓటు వేసిన వ్యక్తి ఏ గుర్తుకు ఓటు వేసరో అన్న సమాచారం vvpat మిషన్ లో 10 సెకండ్ల పాటు కనిపిస్తుంది..
ఆ తరువాత ఆ స్లిప్ box లో పడిపోతుంది… అత్యంత పారదర్శకంగా ఎన్నిక నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు..హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు…రూట్ ఆఫీసర్లు, సెక్టార్ ఆఫీసర్ల పర్యవేక్షణ లో పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో ఈ రోజు సాయంత్రం కి పోలింగ్ సిబ్బంది సామాగ్రి తో సహా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు… రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం 6 గంటల లోపు ఆయా పార్టీల పోలింగ్ ఏజెంట్ లను నియమించుకొని,మాక్ పోలింగ్ నిర్వహించి,సరిగ్గా 7 గంటలకు పోలింగ్ మొదలు పెట్టేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ఎన్నికల కమిషన్………
Tags bjp by election congress huzur nagar kcr shanampudi saidireddy tdp telangana election commission trs Uttam Kumar Reddy uttam padmavati reddy