గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పోలవరంతో సహా రాష్ట్రంలో మొదలైన అన్ని ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని భావించిన జగన్ సర్కార్ పాత టెండర్లు రద్దు చేసి, మళ్లీ కొత్తగా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. పోలవరం ప్రధాన డ్యామ్, హైడల్ ప్రాజెక్టుతో సహా వెలిగొండ వంటి అన్ని ప్రాజెక్టు నిర్మాణపనుల్లో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది. అయితే ఈ రివర్స్ టెండరింగ్‌పై చంద్రబాబు, దేవినేని ఉమతో సహా టీడీపీ నేతలు, ఎల్లోమీడియా పనిగట్టుకుని దుష్ప్రచారం చేశాయి. రివర్స్ టెండరింగ్‌తో ప్రాజెక్టుల పనుల్లో నాణ్యత తగ్గిపోతుందని, కావాలనే ప్రభుత్వం కక్ష సాధింపుతో పాత టెండర్లకు రద్దు చేసి తమకు కావాల్సిన వారికి కొత్తగా టెండర్లు కట్టబెడుతుందని, తద్వారా భారీగా క్విడ్‌ఫ్రోకో జరుగుతందని బాబు బ్యాచ్ గగ్గోలు పెట్టింది. అయితే తాజాగా రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.900 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదా అయిందని జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. అక్టోబర్ 20, ఆదివారం మీడియాతో మాట్లాడిన మంత్రి.. రివర్స్ టెండరింగ్‌పై అన్ని ప్రాజెక్టుల్లో దాదాపు రూ.4 నుంచి 5వేల కోట్ల వరకు నిధులు ఆదా అవుతాయన్నారు. కాగా పోలవరం రివర్స్ టెండర్లలో నవయుగ సంస్థ కు టెండర్లు రద్దు చేయడంపై చంద్రబాబుతో సహా, ఎల్లోమీడియా అక్కసు వెళ్లగక్కింది. ఈ విషయంపై మంత్రి మాట్లాడుతూ..పోలవరం రివర్స్ టెండరింగ్‌లో నవయుగ సంస్థను కూడా పాల్గొనాలని ఆహ్వానించామని తెలిపారు. ఇక టీడీపీ హయాంలో టెండర్ పొందిన రిత్విక్ సంస్థ వెలుగొండ రివర్స్ టెండరింగ్‌లో తక్కువకే టెండర్ వేసిందని మంత్రి అనిల్ చెప్పారు. 900 కోట్ల నిధులు ఆదా చేసిన ప్రభుత్వపై గుడ్డిగా విమర్శలు చేయడం ఆపి అభినందించాలని టీడీపీ నేతలకు మంత్రి అనిల్ చురకలు అంటించారు. ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ లేకపోతే ఈ నిధులు ఏ బాబు జేబులోకి వెళ్లేవో అందరికీ తెలుసని చంద్రబాబును ఉద్దేశించి సెటైర్ వేశారు. అలాగే మంచి మనసున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం వలనే రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు కళకళలాడుతున్నాయని మంత్రి అనిల్‌కుమార్ అన్నారు. దీంతో అవును..బాబుగారిది ఇనుపపాదం…ఎప్పడు సీఎంగా ఉన్నా..రాష్ట్రాన్ని కరువు, కాటకాలు లేకుంటే..తుఫాసులు పట్టిపీడించాయి. కానీ మంచి మనసున్న వైయస్ కుటుంబానికి వరుణదేవుడు కూడా అండగా ఉంటాడు..ప్రకృతి కూడా సహకరిస్తుందని నెట్‌జన్లు సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా రివర్స్ టెండరింగ్‌పై ప్రభుత్వానికి 900 కోట్లు ఆదా అవడంతో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం భేష్ అని ఏపీ ప్రజలు అంటున్నారు. ఒక వేళ జగన్ కనుక రివర్స్ టెండరింగ్‌కు వెళ్లకపోతే మంత్రి అనిల్ అన్నట్లు నిజంగానే ఆ 900 కోట్లు మా బాబు గారి జేబుల్లోకి వెళ్లిపోయేవి అని తెలుగు తమ్ముళ్లు కూడా తమలో తాము గుసగులాడుకుంటున్నారు.
