ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర మరో జాతీయ రికార్డును తన సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మొదలయిందే ఉద్యోగ నీళ్లు నిధులు అంశాలు ఆధారంగా . రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవైపు ప్రాజెక్టులను పూర్తిచేస్తూ రైతన్నలకు భరోసాగా నిలుస్తుంది.
మరోవైపు ఉద్యోగాల భర్తీకి పలు నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పిస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం జాతీయ రికార్డును తన సొంతం చేసుకుంది. మొత్తం 1,17,177ఉద్యోగాల భర్తీతో జాతీయ రికార్డును లిఖించింది.
ఇందులో విద్యుత్ శాఖలో అత్యధికంగా 34,808 నియామకాలను చేపట్టడం విశేషం. అంతేకాకుండా త్వరలోనే మరో రెండు వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది.