తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పై సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి నెల ఆరోగ్య శ్రీకి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలో ఈ పథకానికి ప్రతి నెల రూ.100 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. దీంతో పాటుగా కేసీఆర్ కిట్లు, ఆ పథకంలో భాగంగా గర్భిణులు ,బాలింతలకు ఇచ్చే నగదు బదిలీకి కూడా ప్రతి నెలా రూ.30 కోట్లు ఇవ్వనున్న ప్రభుత్వం 108,104 వాహాన సర్వీసులకు ,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇకపై ప్రతి నెల నిధులు కేటాయించి విడుదల చేయనున్నది.