తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు. ఆరోపణలు.. ప్రతి ఆరోపణలు కురిపించుకుంటున్నారు.
తాజాగా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ,మండలిలో విప్ అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్,బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ” హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీ పార్టీలు కుమ్మక్కు అయ్యాయి. అందుకే బీజేపీ పార్టీ ప్రచారంలో ఆ పార్టీకి చెందిన నేతలు అక్కడ ఒక్కసారి కూడా గెలవని.. ఎమ్మెల్యే లేని టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు కురిపిస్తున్నారు.
కానీ మూడు సార్లు అదే నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ. ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి చేయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఉత్తమ్ పద్మావతి రెడ్డిని ఒక్కమాట కూడా అనడం లేదు అని ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్,బీజేపీలను నమ్మడానికి మరోసారి హుజూర్ నగర్ ప్రజలు సిద్ధంగా లేరు. హుజూర్ నగర్లో ఎగిరేది గులాబీ జెండా.. రేపటి ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందని “ఆయన అన్నారు.