తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హుజూర్‌నగర్ నియోజకవర్గం హాట్‌టాపిక్‌గా మారింది. పీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సొంత ఇలాకా అయిన హుజూర్‌నగర్‌లో జరుగుతున్న ఉప ఎన్నికలు ఇప్పుడు కాకపుట్టిస్తున్నాయి. హుజూర్‌నగర్‌లో 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీ స్థానానికి ఎన్నిక కావడంతో హుజూర్‌నగర్‌లో 8 నెలల్లోనే ఉప
ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికలకు పోలింగ్ అక్టోబర్ 21 న జరుగునుంది. ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్యనే ఉంది. అయితే తెలంగాణలో పూర్తిగా పతనమైన టీడీపీ మాత్రం హుజూర్‌నగర్ ఎన్నికల బరిలో నిలబడింది. దీనికి కారణం ఆంధ్రా ప్రాంతానికి దగ్గరగా ఉన్న హుజూర్‌నగర్‌లో సెటిలర్లు ఎక్కువగా ఉండడం, అలాగే కమ్మ సామాజికవర్గం కూడా బలంగా ఉండడం. దీంతో చంద్రబాబు హుజూర్‌నగర్‌లో కమ్మ సామాజికవర్గానికే చెందిన చావాకిరణ్మయిని తమ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ సతీమణి పద్మావతి, టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిల మధ్యే నెలకొంది. మరోవైపు బీజేపీ అభ్యర్థి రామారావు కూడా కాస్తా కూస్తో ప్రభావం చూపనున్నాడు. ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయి ఏ మాత్రం పోటీ ఇచ్చే పరిస్థితిలో లేదు. అయితే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుండగా టీడీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసేవారే కరువయ్యారు. అందుకే చంద్రబాబు హరికృష‌్ణ కూతురు సుహాసినీని ప్రచారానికి పంపించాడు. సుహాసినీతో పాటు బాలయ్య కూడా ఎన్నికల ప్రచారం చేస్తారని ప్రకటించాడు. ఈ మేరకు బాలయ్యతో బాబు మాట్లాడి ఒప్పించాడు. ఈ మేరకు ఈ నెల 17, 18 వ తేదీల్లో హుజూర్‌నగర్‌లో బాలయ్య ప్రచారం చేస్తారని టీడీపీ ప్రకటించింది. అయితే హుజూర్‌నగర్ టీడీపీ శ్రేణులను నిరాశలో ముంచెత్తుతూ బాలయ్య హుజూర్‌నగర్ వంక కన్నెత్తి కూడా చూడలేదు. స్వయానా బావ చంద్రబాబు చెప్పినా..బాలయ్య హుజూర్‌నగర్‌లో ప్రచారం చేయకుండా ఎందుకు ఎగ్గొట్టాడు అనే విషయంలో పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. హుజూర్‌నగర్‌లో ఎలాగూ గెలిచే సీన్ లేదని, కావాలనే చంద్రబాబు తనను పంపిస్తున్నాడని బాలయ్యకు అర్థమైందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్‌లో ప్రచారం చేసిన బాలయ్య .. బుల్‌బుల్ అంటూ ప్రసంగించి..నవ్వుల పాలయ్యాడు..అంతే కాదు..కూకట్‌పల్లిలో సుహాసిని ఓటమికి, బాలయ్య ప్రచారం కూడా కారణమైందని అప్పట్లో టీడీపీలో చర్చ జరిగింది. ఇవన్నీ మనసులో పెట్టుకున్న బాలయ్య అనవసరంగా హుజూర్‌నగర్‌కు వెళ్లి పరువు పోగొట్టుకోవడం ఎందుకని సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా చంద్రబాబు తనను బకరాను చేస్తున్నాడన్న మ్యాటర్ బాలయ్యకు అర్థమైందని, అందుకే హుజూర్‌నగర్ ఎన్నికల ప్రచారానికి బాలయ్య దూరంగా ఉన్నాడని టీడీపీలో చర్చ జరుగుతోంది.
Tags andhrapradesh balakrishana by election huzurnagar politics reason refuse