తెలంగాణ రాష్ట్రం ‘భారత ఆవిష్కరణల సూచీ’లో 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఈ జాబితాలో.. ఆవిష్కరణల్లో సృజన, వినూత్నతను కనబరుస్తున్న రాష్ట్రాల జాబితాలో కర్ణాటక ముందంజలో ఉండగా.. తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, హరియాణాలు ఆ తర్వాతి స్థానాలను కైవసం చేసుకున్నాయి.
పెట్టుబడులు, మానవ వనరులు, సాంకేతికత, వ్యాపారం, పరిశ్రమల క్లస్టర్లు, ఎగుమతులు, పరిశోధన తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకొని ఆవిష్కరణలతో పాటు వివిధ విభాగాల్లో రాష్ట్రాలకు నీతి ఆయోగ్ ర్యాంకులను ప్రకటించింది. ఆ జాబితాను గురువారం ఢిల్లీలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, సీఈవో అమితాబ్ కాంత్, సైన్స్ విభాగం కార్యదర్శి ఆశుతోష్ శర్మ, బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణు స్వరూప్, ఆయుష్ కార్యదర్శి వైద్య రాజేశ్ కొటేచా విడుదల చేశారు.
100కు 22.06 స్కోర్‌తో పెద్ద రాష్ట్రాల విభాగంలో తెలంగాణ 4వ ర్యాంకు సాధించింది.
35.65 పాయ్లింటతో కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది. ఎనేబులర్స్ విభాగంలో తెలంగాణ 17.29 పాయింట్లతో 9వ ర్యాంకు, పనితీరులో 26.82 పాయింట్లతో 4వ ర్యాంకులో నిలిచింది. మానవ వనరుల విభాగంలో 31.04 పాయింట్ల స్కోర్‌తో 9వ స్థానంలో ఉండగా.. పెట్టుబడుల విషయంలో 6.55 పాయింట్లతో 7వ ర్యాంకును సాధించింది.
తెలంగాణకు నాలెడ్జ్ వర్కర్స్‌లో 15.82 పాయింట్లతో 5వ ర్యాంకు, బిజినెస్ ఎన్విరాన్మెంట్లో 23.43 పాయింట్లతో 4వ ర్యాంకు దక్కింది.
నాలెడ్జ్ ఔట్‌పుట్‌లో 18.76 పాయింట్లతో 4వ ర్యాంకులో, నాలెడ్జ్ డిఫ్యూజన్లో 34.89 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది.
Post Views: 384