వచ్చే నెల ఇరవై రెండో తారీఖున మొదలు కానున్న టీమిండియా-బంగ్లాదేశ్ తొలి టెస్టు మ్యాచ్ కు ఇరు దేశాలకు చెందిన ప్రధానమంత్రులు నరేందర్ మోదీ, షేక్ హసీనా వాజేద్ లను బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఆహ్వానించింది.
ఈడెన్ గార్డెన్ లో అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించే సందర్భంలో పలు రంగాల సెలెబ్రిటీలను ఆహ్వానించడం క్యాబ్ అనవాయితీగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ సారి ఇరు దేశాలకు చెందిన ప్రధాన మంత్రులను చీఫ్ గెస్టులుగా పిలవాలని క్యాబ్ నిర్ణయం తీసుకుంది.