తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు రేపు ఉదయం 10.30గం.లకు ఆర్టీసీ సిబ్బందిని చర్చలకు పిలవాలని ఆదేశించింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. దీనిపై ఏజీ స్పందిస్తూ ఇందులో తమ ప్రమేయం లేదు అని వ్యాఖ్యానించారు.
దీనిపై హైకోర్టు స్పందిస్తూ యూనియన్లతో చర్చలు జరపాలని కార్పోరేషన్ ను ఆదేశిస్తామని తెలిపింది. దీంతో ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని హైకోర్టుకు యూనియన్లు తెలిపాయి.