తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు అక్టోబర్ నెల కు సంబంధించిన నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో భాగంగా మొత్తం రూ.339 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
పద్నాలుగువ ఆర్థిక సంఘం నిధులు రూ.203 కోట్లతో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ గ్రాంటు రూ. 136 కోట్లు కలిపి మొత్తం నెలకు రూ.339 కోట్లను విడుదల చేసింది. అంతకుముందు పల్లె ప్రగతి కార్యాచరణ ప్రణాళిక అమల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేసిన సంగతి విదితమే.
అక్టోబర్ నెలకు సంబంధించిన నిధులను తాజాగా విడుదల చేస్తూ పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు నిన్న గురువారం ప్రొసీడింగ్స్ ఇచ్చారు.