బుల్లితెరపై సీరియళ్లు, వంటల ప్రోగ్రామ్స్, ఆడియో ఫంక్షన్లు చేసుకుంటూ వచ్చిన యాంకర్ శ్యామల బిగ్ బాస్ 2తో హౌస్‌లో ఎంట్రీ ఇవ్వడంతో మరింత క్రేజ్ పెరిగిపోయింది. అయితే తాజాగా శ్యామల చేసిన పోస్ట్ ఆమెకు పెద్ద తలనొప్పిని తెచ్చినట్లైంది. శ్యామల చేసిన పోస్ట్ లో ఏముందంటే మహిళ.. తల్లి కావడం అనేది ఓ గొప్ప అనుభూతి. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, నిద్ర లేని రాత్రులుంటాయి.. కానీ ప్రతీరోజూ ఏదో ఒకటి సాధించినట్లు ఫీల్ అవుతాము. అందుకే ఈ ఆనంద క్షణాలను సెలబ్రేట్ చేసుకోవడానికి నా భర్త నరసింహ.. డైమండ్ బ్రాస్లైట్ కానుకగా ఇచ్చాడు.అని సోషల్ మీడియాలో పెట్టింది. దీంత ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు.. మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యారా అంటూ ప్రశ్నలు కురిపించసాగారు. అయితే అలాంటిదేమీ కాదని.. అదొక ప్రకటనకు సంబంధించినదని వివరణ ఇస్తోంది. దీంతో ఈ పోస్ట్ కొద్దిసేపట్లోనే వైరల్ కాసాగింది.