సాహో సినిమా నిర్మాతలపై బెంగుళూరుకు చెందిన ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాహో నిర్మాతలైన యూ.వీ. క్రియేషన్స్ తమ సంస్థ పేరున్న లగేజీ బ్యాగులను సినిమా సన్నివేశాలలో ప్రదర్శిస్తామని నమ్మించి దాదాపు 1 కోటి 40 లక్షల రూపాయల వరకు మోసం చేసారంటూ ఆర్క్ టిక్ ఫాక్స్ లగేజీ బ్యాగ్స్ తయారీ సంస్థ ఆరోపించింది. ఇందుకుగాను సాహో నిర్మాతలపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
