దర్శకుడు కొరటాల శివ భరత్ అనే నేను సినిమా తరువాత చిరంజీవితో తప్ప వేరే వాళ్ళతో తీయకూడదని ఫిక్స్ అయ్యాడు. అయితే మెగాస్టార్ సైరా చిత్రంతో బిజీ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ కాస్తా లేట్ అయ్యింది. అయితే ఇప్పుడు సైరా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ అందుకుంది. అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసింది. దాంతో ఫ్రీ అయిన చిరు కొరటాల సినిమాకు సంబంధించి అప్పుడే పూజ కూడా చేసారు. వచ్చే నెల నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రంలో హీరో అయితే ఉన్నాడుగాని హీరోయిన్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ముందు నయనతార, కాజల్ అనుకున్నారు. కాని తాజా సమాచారం ప్రకారం త్రిష ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇదివరకే త్రిష మెగాస్టార్ తో నటించిన అనుభవం ఉంది. ఇంకొక విశేషం ఏమిటంటే కొరటాల తీసే చిత్రాలలో హీరోయిన్ పాత్ర పెద్దగా ఉండదు. ఇవ్వని దృష్టిలో పెట్టుకొని త్రిషను తీసుకున్నట్టు తెలుస్తుంది.
