శ్వేతా బసు ప్రసాద్..ఈ పేరు చెబితే ముందుగా ఎవరికైనా గుర్తొచ్చే చిత్రం కొత్త బంగారు లోకం. ఈ చిత్రం లో తన నటనకు అందరు ఫిదా అయ్యారని చెప్పాలి. ఒక్కసారిగా అందరిని తన పక్కకు తిప్పుకుంది.అలా కొన్ని రోజులు తన హవా నడించింది. కాలం గడిచే కొద్ది తన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో సైడ్ హీరోయిన్, ఐటమ్ సాంగ్స్ కే పరిమితం అయ్యింది.ఇలా ఎన్ని అవతారాలు ఎత్తినా ఇబ్బందులు మాత్రం తనని వదలలేదు. చివరికి వ్యభిచారంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. దాంతో ఒక్కసారిగా మీడియాకు ఒక హాట్ టాపిక్ దొరకడంతో కోర్టులు, కేసులు అని ఆడుకున్నారు. తాజగా బాలీవుడ్ సినిమాలతో శ్వేతా బసు ప్రసాద్ రీ ఎంట్రీ ఇవ్వనుంది. ‘ది తాష్కెంట్ ఫైల్స్’ సినిమాలో నటించడం ఆమె ఓ వరంలా మారింది.ఈ ముద్దుగుమ్మ నటించిన ఈ సినిమా ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది. దీంతో బాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయట. ఇంకా తెలుగులో పేరున్న నిర్మాతలు శ్వేతబసుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. శ్వేతా బసు నటించిన ఈ సినిమా ఆస్కార్‌కి వెళ్ళనుండడంతో ఆమె ఆనందానికి హద్దులు లేవు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో శ్వేతాబసుకి మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
