2014 తరువాత తెలంగాణా రాష్ట్రంలో వచ్చిన మార్పును చూసి ఈ ఉపఎన్నికలలో టి ఆర్ యస్ పార్టీని గెలిపించాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.మట్టపల్లి ఎన్ సి ఎల్ న్యూ కాలనీ లో జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలనీ కమ్యూనిటీ హాల్ లో జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఇది మహిళాసాధికారత సాధించిన ప్రభుత్వం అని ఆయన చెప్పుకొచ్చారు.అటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మహిళల మీద ఉందన్నారు.
కళ్యాణాలక్ష్మి,కేసీఆర్ కిట్, అమ్మ ఒడి,ఒంటరి మహిళ వంటి విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలతో పాటు బిసి, యస్ సి,మైనార్టీ బాలికల గురుకులాలు ప్రారంభించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని ఆయన కొనియాడారు.
అటువంటి ప్రభుత్వానికి రేపటి హుజుర్నగర్ ఉపన్నికలలో మద్దతు నిచ్చి శానంపూడి సైదిరెడ్డి విజయానికి దోహద పడాలని ఆయన పిలుపునిచ్చారు.సైదిరెడ్డి విజయం తో హుజుర్నగర్ లో మరింత అభివృద్ధి సాధించవచ్చని ఆయన చెప్పారు.ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ విజయలక్ష్మి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు
Post Views: 268