జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం అగమ్యగోచరంగా మారింది. 2014లో తెలుగుదేశం పార్టీకి బీజేపీ పార్టీలకు మద్దతుగా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ అనంతరం ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య పైన పోరాటం చేయలేకపోయారు. తాను పార్టీ పెట్టింది పాలించడం కోసం కాదని ప్రశ్నించడం కోసమేనని జనంలోకి వచ్చిన జనసేన అని ఆ జనాన్ని మర్చిపోయి చంద్రబాబుకు నమ్మినబంటుగా మారిపోయారు. చివరికి 2019 ఎన్నికల్లో ఎన్నికల సమయంలో టికెట్లు విషయంలోనూ పవన్ చంద్రబాబు ఆదేశాలు ఫాలో అయ్యారు అనేది ప్రధాన విమర్శ. అసలు పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి కేవలం వైసీపీ పార్టీని విమర్శించడం ప్రతిపక్ష హోదాలో ఉన్న అప్పటి వైసీపీ పై విమర్శలు చేయడం అధికారంలో ఉండి ప్రజలకు మేలు చేయాలని ప్రభుత్వాన్ని తెలుగుదేశం సర్కార్ను కనీసం లేకపోవడమేనని ఓడిపోయిన తర్వాత చేసుకున్న సమీక్షలో చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ కి అర్థమైంది. అయితే తాను నమ్మిన సిద్ధాంతాల కోసం తనను నమ్ముకున్న అభిమానుల కోసం జనసేనని స్థాపించిన పవన్ తన సొంత మైండ్ సెట్ తో రాజకీయాలు చేసి ఉంటే 2019 ఫలితాలు మరోలా ఉండేవి. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ సొంత పార్టీని సొంతంగా నడుపుకోవాలని, చంద్రబాబు చెర నుండి బయటకు రావాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.
