విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు ఖమ్మం నగరానికి విచ్చేసారు. ఇవాళ కల్లూరు మండలం, నారాయణపురం గ్రామంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహస్ర చండీయాగంలో ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు నిన్న ఖమ్మం నగరానికి చేరుకున్న శ్రీ స్వరూపానందేంద్ర ఖమ్మం నగరంలోని పొంగులేటి గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. నిన్న ఖమ్మం చేరుకున్న మహాస్వామికి, ఉత్తరాధికారి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, హిందూ ధర్మ ప్రచారయాత్ర సమన్వయకర్త, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి, పొంగులేటి కుటుంబసభ్యులు ఘనస్వాగతం పలికారు. ఇవాళ ఉదయం పొంగులేటి గెస్ట్‌హౌస్‌లో శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారిని గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర దంపతులు, హుస్నాబాద్ ఎమ్మెల్యే శ్రీ వొడితెల సతీష్‌కుమార్ తదితర ప్రముఖులు దర్శించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ రోజు నారాయణపురం గ్రామంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహిస్తున్న సహస్ర చండీయాగంలో ఇద్దరు స్వామిజీలు పాల్గొంటారు. రేపు అంటే అక్టోబర్ 18న ఖమ్మం నగరంలో వద్దిరాజు రవిచంద్ర దంపతుల ఆధ్వర్యంలో శ్రీ స్వరూపానందేంద్ర, శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివార్లకు పుష్పాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలను హిందూ ధర్మ ప్రచారయాత్ర సమన్వయకర్త, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పర్యవేక్షించనున్నారు.
